నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు పేర్కొన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు బతుకమ్మ తీసుకొస్తే రూ.300, బోనాలు తీసుకొస్తే రూ. 200, హారతులు ఇస్తే కూడా డబ్బులు ఇస్తామని దండోరాలు వేయిస్తూన్నారు. బీఆర్ఎస్ నేతలు మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు సునీతరావు.
మహిళలను అగౌరవ పరిస్తే వచ్చే ఎన్నికల్లో మీ సీట్లు సునామీలో కొట్టుకు పోతాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అన్నారు సునీతరావు. మహిళ రిజర్వేషన్ పై మాట్లాడే కవిత మహిళలను,బతుకమ్మను అవమాన పరుస్తున్న సొంత ఎమ్మెల్యే పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలకు క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మెపరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.