విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల తర్వాత తీసిన ప్రతి సినిమా కూడా ఆయనకు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి . అలా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ఎలాగైనా సరే ఖుషి సినిమాతో సక్సెస్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నం చేశారు విజయ్ దేవరకొండ.. అందులో భాగంగానే సమంత , విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఖుషి సినిమా నేడు విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే యూఎస్ ప్రివ్యూ లు కూడా పడిపోయాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా విజయ్ దేవరకొండ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే చాలు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? అనేది హాట్ టాపిక్ గానే మిగులుతుంది. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను తాజాగా నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన నెల తర్వాత అంటే అక్టోబర్ మొదటివారం నుంచి డిజిటల్ రిలీజ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఇంకా హిట్ టాక్ తో నెలరోజుల తర్వాత కూడా కొనసాగితే ఈ డేట్ మారే అవకాశం కూడా ఉంటుందని సమాచారం.
ఇకపోతే లైగర్ సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా మార్కెట్ బాగా పెరిగిపోయింది. దాంతో నెట్ ఫ్లిక్స్ రూ.30 కోట్లకు ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు రూ.20 కోట్లకు కొనుగోలు చేశారట. వీటన్నిటితోపాటు హిందీ సాటిలైట్ రైట్స్ , యూట్యూబ్ రైట్స్ , ఆడియో రైట్స్ అన్నీ కలిపి మొత్తం రూ.90 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. ఇదే నిజమైతే ఈ డబ్బులతోనే నిర్మాత లాభాల బాట పట్టినట్లే అని చెప్పవచ్చు.