“ఖుషి “… ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ !

-

ఈ రోజు థియేటర్ లలోకి చాలా గ్రాండ్ గా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి మూవీ వచ్చింది. విజయ్ దేవరకొండ మరియు సమంత లు నటించిన మూవీకి రిలీజ్ కు ముందు నుండి మంచి మైలేజ్ వచ్చింది. ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు థియేటర్ నుండి ఎంతో సంతోషంగా వస్తున్నారని వార్తలు అందుతున్నాయి. శివ నిర్వాణకు లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో ప్రత్యేక శైలి అని చెప్పాలి. హీరో హీరోయిన్ లుగా చేసిన విజయ్ మరియు సమంతలు తమకి ఇచ్చిన విప్లవ్ మరియు ఆరాధ్య పాత్రలలో జీవించడమే ప్లస్ అయిందంటూ ప్రేక్షకులు కంప్లిమెంట్ ఇస్తున్నారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ న్యాయం చేయడమే సినిమా అవుట్ ఫుట్ కు కారణమని తెలుస్తోంది. సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ లో లాగ్ అవడం.. స్క్రీన్ ప్లే కొంచెం పొరపాటు కావడం మినహాయిస్తే సినిమా మొత్తం సూపర్ అంటూ రివ్యూలు వస్తున్నాయి.

మొత్తానికి విజయ్ కెరీర్ లో మరో హిట్ పడింది.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఖుషి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ లవ్ మూవీ అంటూ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news