మహిళా క్రికెటర్ మహికా గౌర్ రికార్డ్ … !

-

ఇంగ్లాండ్ లో జన్మించిన మహిళా మహికా గౌర్ ఆ తర్వాత దుబాయ్ కు వలస వెళ్లి అక్కడ క్రికెటర్ గా స్థిరపడ్డారు. అక్కడ కేవలం 13 సంవత్సరాల వయసులోనే యూఏఈ తరపున మహిళా క్రికెటర్ గా అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహించారు. యూఏఈ తరపున మొత్తం 19 టీ 20 మ్యాచ్ లలో ఆడి వికెట్లు తీసుకున్నారు మహికా గౌర్. కానీ ఈ సంవత్సరం రెండవ ప్రథమార్థంలో ఇంగ్లాండ్ ఏ టీం కు మహికా సెలెక్ట్ అయింది. ఇక ఇంగ్లాండ్ లో జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్ మరియు ఇతర టోర్నమెంట్ లలో ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించి జాతీయ మహిళా జట్టులో చోటు సంపాదించుకుంది. ఇక నిన్నటి నుండి శ్రీలంక తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో చోటు రావడంతో రాత్రి మ్యాచ్ లోనే అరంగేట్రం చేసి ఒక్క వికెట్ ను దక్కించుకుంది. ఇక తాను ఆడిన మొదటి మ్యాచ్ లోనూ వికెట్ ను దక్కించుకోవడం విశేషం..

అంతే కాకుండా మహికా గౌర్ రెండు దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన క్రికెటర్ గా గుర్తింపు దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news