తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని బిజీ యాంకర్ గా దూసుకుపోతున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వారానికి ఏడు రోజులైతే ఏడు రోజులు కూడా క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపే ఈమె మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా అచ్చమైన తెలుగు భాషతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన సుమ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా సుమ చేస్తున్న ఒక మంచి పని తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. అంతేకాదు ఈమె తీసుకున్న ఈ నిర్ణయానికి గొప్పవాళ్ళ మనసులు ఇలాగే ఉంటాయంటూ నెటజన్ లు సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు సుమ ఏం చేసింది అనే విషయానికి వస్తే.. నలుగురికి సహాయ పడాలని సంకల్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఒక పెద్ద కార్యాన్ని మొదలుపెట్టిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ అనే సంస్థ సుమ డ్రీమ్ అట ఎందుకంటే.. తనకు వచ్చిన దాంట్లో తాను మాత్రమే తినడమే కాకుండా అందరికీ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
తన వంతుగా 30 మంది స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకొని చదివిస్తోంది కూడా.. అంతేకాదు వాళ్లు బాగా సెటిల్ అయ్యేవరకు వారి బాధ్యత తనదేనని.. తాను వాళ్లతోనే ఉంటానని.. అంతేకాదు ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చింది.అంతేకాదు వారితోపాటు జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు అంటూ సుమా చెప్పుకొచ్చింది. ఎప్పుడు సరదాగా తన మాటలతో అందరినీ ఆటపట్టించే సుమ ఎవరికి చెప్పకుండా ఇంత మంచి పనులు చేస్తూ తన మంచితనాన్ని చాటుకుంటుంది అంటూ అభిమానుల సైతం ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా సుమ గొప్ప మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు.