వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీని క్షమించాలి – వైఎస్ షర్మిల

-

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలి అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో ఆమె పలు ఆసక్తికర వ్యాక్యలు చేశారు. మన మధ్య నుంచి వెళ్ళిపోయిన కోట్ల మంది గుండెల్లో ఉన్నారు అని తెలిపారు షర్మిల.  ఆయన అందించిన పథకాలు ఇంకా ఆయన్ని ప్రజల్లో ఉంచాయి. రైతులకు పెట్టుబడిని తగ్గించి.. రాబడి పెంచేలా చర్యలు తీసుకున్నారు..మహిళలకు రుణాలు ఇచ్చారు.. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్మెంట్స్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి వల్ల ఎంతో మంది పునర్జన్మను పొందారు. ఐదు సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉన్న అందరిని ఆదుకున్నారు.. జనాల్లో ఉన్నారు.

46లక్షల ఇళ్లను పేదలకు కట్టించారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారు.. అందరిని ఆదుకున్నారు.. ఆయన్ని మరణాన్ని జీర్ణించుకోలేక 700 మంది అభిమానుల గుండె ఆగింది.. వైఎస్సార్‌పై అపారమైన గౌరవం ఉందని సోనియా, రాహుల్ తనతో చెప్పారని షర్మిల అన్నారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా సీబీఐ చార్జిషీట్ లో అబ్ స్కాండర్‌గా ఆయన పేరును చేర్చారని.. ఆ బాధ ఎలా ఉంటుంతో తెలుసని వారు తనతో అన్నారని చెప్పారు. వైఎస్సార్ లేని లోటు తెలుస్తోందని కూడా వారు అన్నారని తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news