ఛలో ఢిల్లీకి ఆర్ కృష్ణయ్య పిలుపు … !

-

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఛలో ఢిల్లీ కి వెళ్ళడానికి పిలుపు ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీసీ లకు సీట్ లను కేటాయించే విషయంలో సముచిత స్థానాన్ని కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్ లు ఇఇంకా మహిళా బిల్లులో బీసీ మహిళా షబ్ కోట కల్పించాలంటూ ఈయన డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో దాదాపుగా 56 శాతం మంది బీసీలు ఉన్నారని, అటువంటిది వీరికి ఎందుకు అన్ని రంగాలలో మంచి స్థానం కల్పించడం లేదంటూ ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. మొదటి నుండి కూడా బీసీ లకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్ కృష్ణయ్య వాపోయారు.

దేశాన్ని పాలిస్తున్న ఈ పాలకులు ఎందుకు బీసీ లను పట్టించుకోవడం లేదంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. అందుకే సెప్టెంబర్ 21వ తేదీన ఢిల్లీ వెళ్ళడానికి కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news