ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి గోపీచంద్ రామ‌బాణం – రిలీజ్ డేట్ ఫిక్స్‌!

-

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా రామబాణం. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో గోపీచంద్ నటించిన ఈ సినిమాకు శ్రీ వాసు దర్శకత్వం వహించారు.

ramabanam-digital-premier-date-fixed
ramabanam-digital-premier-date-fixed

అలాగే ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. రామబాణం సినిమా థియేటర్లో రిలీజ్ అయి .. అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గోపీచంద్ నటించిన రామబాణం సినిమా సెప్టెంబరు 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. డింపుల్ హయాతి లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా లో జగపతిబాబు కూడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా… ఓటీ టీవలో అయినా ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news