నవరాత్రి అంటే దుర్గామాతను వివిధ రూపాల్లో పూజించే తొమ్మిది రాత్రులు. ఈ పండుగలో మూడవ రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో కొలుస్తారు. అన్నపూర్ణ అంటే ఆహారాన్ని, సంపదను ఇచ్చే తల్లి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ఆకలి పేదరికం తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నిండుతాయని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజు విశిష్టత, ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి మూడవ రోజు ప్రాముఖ్యత: నవరాత్రిలో మూడవ రోజు చంద్రఘంట దేవిని పూజిస్తారు. అయితే ఈ రోజున చాలామంది అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా కూడా పూజిస్తారు. అన్నపూర్ణా దేవి శివుడికి ఆహారాన్ని అందించే తల్లిగా పురాణాల్లో వర్ణించబడింది. సృష్టిలో జీవరాశిని పోషించేది ఆమే అని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా ఇంట్లో ఆహారానికి ధనానికి లోటు ఉండదని కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల విశ్వాసం.

పూజ విధానం, నైవైద్యం: అన్నపూర్ణా దేవిని పూజించేటప్పుడు, ఇంట్లో ఉన్న ఆహార ధాన్యాలు బియ్యం, గోధుమలు వంటి వాటిని అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. ఇది ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు రాకూడదని చేసే ఒక సంకేతమైన ఆచారం. అమ్మవారిని భక్తితో పూజించడం వల్ల ఆమె కోరికలు తీరుస్తుందని ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నింపుతుందని నమ్మకం. ఈ రోజున అమ్మవారికి పాయసం పొంగలి,దద్దోజనం, పండ్లు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక్కడ ముఖ్యంగా తెల్లని లేదా లేత పసుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులు అన్నపూర్ణా దేవి మంత్రాలను పఠిస్తారు.
నవరాత్రి మూడవ రోజున భోగప్రదాత్రి అన్నపూర్ణా దేవిని పూజించడం చాలా పవిత్రమైన విషయం. ఇది మన జీవితంలో ధనానికి, ఆహారానికి లోటు లేకుండా చూస్తుంది. ఈ పండుగ మనకు భక్తితో పాటు, జీవితంలో దైవత్వం పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను గుర్తు చేస్తుంది.
గమనిక: నవరాత్రిలో పూజలు ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణమైనది. మీ కుటుంబ సంప్రదాయాలను అనుసరించడం మంచిది.