ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్.. యువతకు 24 రంగాల్లో అవకాశం..

-

కాలేజీ చదువు పూర్తయిన తర్వాత చాలామంది యువతకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న “ఉద్యోగం ఎలా సంపాదించాలి?”. పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానం సరిపోదు ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యం. ఈ లోటును పూడ్చడానికి భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్. ఈ పథకం ద్వారా యువతకు 24 రకాల రంగాల్లో ఏడాదిపాటు శిక్షణ పొందే అద్భుత అవకాశం లభిస్తుంది. ఈ పథకం పూర్తీ సమాచారం తెలుసుకుంద్దాం..

పథకం లక్ష్యాలు: ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రధాన లక్ష్యం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడం. ఈ పథకం ద్వారా విద్యార్థులు, యువ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో నేరుగా పని చేసే అవకాశం పొందుతారు. ఇది వారికి ఆచరణాత్మక అనుభవం వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.

ఏ రంగాల్లో ఇంటర్న్‌షిప్ లభిస్తుంది: ఈ పథకం కింద సుమారు 24 రకాల రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి. విద్యుత్,అగ్రికల్చర్,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పట్టణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, భారీ పరిశ్రమలు మొదలైనవి.

Prime Minister Internship Scheme: Opportunities in 24 Fields for Youth
Prime Minister Internship Scheme: Opportunities in 24 Fields for Youth

ఇంటర్న్‌షిప్ వ్యవధి, ప్రయోజనాలు: ఈ ఇంటర్న్‌షిప్ పథకం కింద యువతకు 12 నెలల పాటు అవకాశం లభిస్తుంది. ఈ కాలంలో వారికి వృత్తిపరమైన శిక్షణతో పాటు నెలకు కొంత స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఈ అనుభవం వారి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు చాలా ఉపయోగపడుతుంది.

ప్రధాన్ మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ యువతకు ఒక గొప్ప అవకాశం. ఇది కేవలం ఆర్థికంగా సహాయపడటమే కాకుండా వారి కెరీర్‌కు సరైన మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా యువత దేశాభివృద్ధిలో కూడా భాగం కావచ్చు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక అడుగు.

ఈ పథకంలో చేరడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌(https://pminternship.mca.gov.in)ను సందర్శించడం మంచిది. అర్హత, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news