ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజు స్థానంలో నందమూరి వంశస్థురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ అధిష్టానం ఎంతో నమ్మకంతో నియమించింది. అధిష్టానం నిర్ణయం తప్పుకాదని కాకూడదన్న బలమైన కమిట్మెంట్ తో పురందేశ్వరి బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి పూనుకుంది. అందులో భాగంగా తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పురందేశ్వరి రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బీజేపీ అధ్యక్షులుగా ఉన్న వాగారిని మార్చే దిశగా నిర్ణయాలు తీసుకోనుందట. కానీ బీజేపీ అధిష్టానం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సోము వీర్రాజు ఉన్న సమయంలో నియమించిన జిల్లా అధ్యక్షులలో మార్పులు జరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో పురందేశ్వరి పార్టీ అభివృద్ధి కోసం ఏమి చేయనున్నారో తెలియాల్సి ఉంది.
కాగా ఏపీలో ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్నందున బీజేపీ, టీడీపీ మరియు జనసేన కలిసి ఎన్నికలకు వెలుతారా లేదా పొత్తుల అంశంపై క్లారిటీ ఏమన్నది తెలియాల్సి ఉంది.