“క్రిస్ గేల్” రికార్డుకు చేరువలో హతి మ్యాన్ రోహిత్ శర్మ … !

-

వెస్ట్ ఇండీస్ ఆల్ టైం బెస్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఉన్నాడు. ఇతను సాధించినా రికార్డులు అన్నీ ఇన్నీ కావు..ముఖ్యంగా టీ 20 లలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్ లు జరిగిన అందులో గేల్ ఉంటాడు, అంతలా తన ప్రభంజనాన్ని సృష్టించాడు. కాగా ఇప్పటికే గేల్ పేరు మీద ఉన్న రికార్డులలో అత్యధిక అంతర్జాతీయ సిక్సులు ఒకటి.. గేల్ అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పే సమయానికి, 483 మ్యాచ్ లలో ఇతని పేరు మీద 553 సిక్సులు ఉన్నాయి. ఇక ప్రస్తుత కాలంలో కీలక ప్లేయర్ గా ఉన్న ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే ఇతనికి చాలా దగ్గరగా ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 446 అంతర్జాతీయ మ్యాచ్ లలో 539 సిక్సులు బాదాడు. గేల్ కు మరియు రోహిత్ కు మధ్యన కేవలం 14 సిక్సులు మాత్రమే గ్యాప్ ఉంది.

ఈ వరల్డ్ కప్ లో లేదా ఆసియా కప్ మరియు ఆస్ట్రేలియా తో ఆడనున్న సిరీస్ లో పూర్తి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం క్రిస్ గేల్ సిక్సులు రికార్డు ఎప్పుడు బద్దలు అవుతుందో ?

Read more RELATED
Recommended to you

Latest news