ఈనెల 15న BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం

-

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇటీవల కేంద్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ఇండియా పేరు భారత్​గా మార్చే అంశంపై చర్చించి.. తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఇందుకోసం ఈనెల 15వ తేదీన పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది.

brs party

శుక్రవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలు పార్లమంటు ప్రత్యేక సమావేశాల్లో రావొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇతర అంశాలపై చర్చకు కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. చట్ట సభల్లో మహిళల రిజర్వేష్లపై చర్చ జరపాలని ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీలకు లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news