చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు

-

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. సాయంత్రం 4 గంటలకు ములాఖత్ కి ఏర్పాట్లు జరిగాయి. ఈ ములాఖత్ కోసం కుటుంబ సభ్యులంతా ముందస్తుగానే రాజమండ్రి చేరుకున్నారు. నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రికి వచ్చారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కూడా రాజమండ్రికి వచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇచ్చారు. దీంతో ఆయన యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచారు. రాజమండ్రి వచ్చిన కుటుంబ సభ్యులు కారవాన్ లోనే విశ్రాంతి తీసుకున్నారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులతో ములాఖత్ నిర్వహించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్. చంద్రబాబు ని కలిసి పలు విషయాల గురించి చర్చించారు. తొలిరోజు కేవలం ముగ్గురికి మాత్రమే 45 నిమిషాల పాటు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ములాఖత్ నేపథ్యంలో జైలు వద్ద ఆంక్షలు విధించారు. పోలీసులు భారీగా మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news