40% సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. ఏపీ, తెలంగాణలో ఎంత మంది ఉన్నారంటే..?

-

లోక్​సభ, రాజ్యసభలోని సిట్టింగ్‌ ఎంపీల్లో 40 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. అందులో 25 శాతం మందిపై హత్య, కిడ్నాప్‌, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిసి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించిన ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది​.

పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి మొత్తం 776 ఎంపీలకు గానూ 763 మంది ఎంపీలు.. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి నివేదికను రూపొందించింది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడం, అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల కొన్నింటిని పక్కనపెట్టింది. మొత్తం 763 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 306 మంది (40 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. అందులో 194 మంది (25 శాతం)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని చెప్పింది. తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా.. అందులో 9 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news