వరుస విజయలాతో దూసుకెళ్తున్న నవ యువ సంచలనం విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కోలీవుడ్ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. సినిమాలో విజయ్ సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
అసలైతే అక్టోబర్ 4న రిలీజ్ అనుకున్న ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. 4 నుండి 18కి ఈ సినిమా వాయిదా పడుతుందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో అనుకున్న టైం కు రిలీజ్ అవదని అంటున్నారు. అయితే ఆల్రెడీ అక్టోబర్ 18న రాం హలో గురు ప్రేమ కోసమే, విశాల్ పందెం కోడి-2 రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. మరి విజయ్ కూడా అదే డేట్ కు వస్తాడా లేక అక్టోబర్ 11న రాబోతున్న అరవింద సమేతకు పోటీగా దిగుతాడా అన్నది చూడాలి.