CM YS Jagan : నేడు నిడదవోలులో సీఎం వైఎస్‌.జగన్‌ పర్యటన…షెడ్యూల్ ఇదే

-

CM YS Jagan :  సీఎం జగన్‌ నిడదవోలు పర్యటన ఖరారు అయింది. నేడు తూర్పుగోదావరిజిల్లా నిడదవోలులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాపు నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేందుకు బటన్‌ నొక్కనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే…ఇవాళ ఉ. 9.30 గం.లకు తాడేపల్లి గుంటూరు జిల్లా లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి ఉ. 9.35 గం.లకు తాడేపల్లి హెలిప్యాడ్ చేరుకుంటారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

CM YS Jagan's visit to Nidadavolu today
CM YS Jagan’s visit to Nidadavolu today

ఉ.9.40 గం.లకు తాడేపల్లి నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి ఉ. 10.10 గం.లకు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారు. అనంతరం ఉ.10.10 నుంచి 10.20 గం. వరకు ప్రజా ప్రతినిధులతో కలవడం జరుగుతుంది.అనంతరం ఉ.10.20 గం.లకు రోడ్డు మార్గాన (రోడ్ షో) బయలుదేరి ఉ.10.30 గం.లకు సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం ఉ. 10.35 నుంచి ఉ.12.05 గం.ల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మ.12.10 గం.లకు తిరిగి రోడ్డు మార్గాన హెలీప్యాడ్ చేరుకొని మ. 12.40 గం.ల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. అనంతరం మ. 12.45 గం.లకు హెలీకాప్టర్ లో బయలు దేరి మ. 1.25 గం.లకు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news