అనంతపురం : నిట్టూరు గ్రామంలో ముగ్గురు దారుణ హత్య

 

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో ఏకంగా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా సంఘటన ఏపీ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరులో దారుణం జరిగింది. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో త్రిబుల్ మర్డర్ కలకలం రేపింది.

Three brutally murdered in Nittoor village
Three brutally  in Nittoor village

ఇంటి బయట నిద్రిస్తున్న భార్యా భర్తలు అయిన బాలరాజు ( 53), సుంకులక్క( 47 )లను కొడవలితో నరికి చంపాడు ప్రసాద్ ( 35) అనే వ్యక్తి. దీంతో భార్యా భర్తలు అయిన బాలరాజు(53), సుంకులక్క ( 47 ) ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం ప్రసాద్ ను రాళ్ల తో కొట్టి… బాలరాజు , సుంకులక్క కుటుంబ సభ్యులు చంపారు. దీంతో యాడికి మండలం నిట్టూరు గ్రామంలో త్రిబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇక ఈ సంఘటన పై సమాచారం అందుకున్న అనంతపురం జిల్లా పోలీసులు.. అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.