వాట్సప్‌కు తగ్గిన ఆదరణ.. రీజ‌న్ ఇదేనా..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సప్‌కు యూజ‌ర్ల నుంచి ఎంత‌టి ఆద‌ర‌ణ ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే గ‌త కొంత కాలంగా వాట్సప్‌ను ఉపయోగించేందుకు భారతీయులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్ర‌కారం.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 మధ్యకాలంలో భారతదేశంలో వాట్సప్ డౌన్‌లోడ్స్ 80 శాతం తగ్గినట్లు తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌లోని ప్రముఖుల వాట్సప్‌లను హ్యాక్ చేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాట్సప్‌‌ను ఉపయోగించడానికి భారతీయులు విముఖత వ్యక్తం చేస్తున్నారని నివేదిక పేర్కొంది.

అయితే అక్టోబర్ 26-నవంబర్ 3 మధ్య వాట్సప్ డౌన్‌లోడ్స్‌ తగ్గగా టెలిగ్రామ్‌కు ఆదరణ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే యాప్ వినియోగిస్తున్న వారు కూడా తాము కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నట్టు నివేదిక‌లో తేలింది. కొంత మంది అయితే తమకు ఉన్న అత్యవసర పరిస్థితి కారణంగానే ఈ యాప్ ని వినియోగిస్తున్నామని, త్వరలో దాని నుంచి బయటపడే మార్గాలు చూసుకుంటామని చెప్పారట. కాగా భారత్ లో వాట్సాప్ కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news