వైరస్ బారిన పడి 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృత్యువాత!

-

భారత్ లో రోజురోజుకు పులుల సంఖ్య అంతరించిపోతుంది. ముఖ్యంగా ఇటీవల కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ పార్క్‌లో చిరుత కూన వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ పార్కులో  15 రోజుల వ్యవధిలోనే ఏడు చిరుత కూనలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న అధికారులు.. వీటి మృతిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర అంటువ్యాధి ‘ఫీలైన్‌ పాన్ల్యూకోపెనియా’ బారిన పడి అవి చనిపోయినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

అయితే గతంలోనే వాటికి టీకాలు వేయించినప్పటికీ.. వైరస్‌ సోకిందని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్కు అధికారులు తెలిపారు. తొమ్మిది చిరుతపులి పిల్లలను సఫారీ ప్రాంతంలోకి విడుదల చేయగీ.. వాటిలో నాలుగు.. వైరస్‌ బారినపడి చనిపోయాయని చెప్పారు. రెస్క్యూ సెంటర్‌లోని మరో మూడు కూనలకూ వైరస్‌ సోకిందని.. సరైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. చనిపోయిన కూనల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉందిని.. ఆగస్టు 22న మొదటిసారి వైరస్‌ వ్యాప్తిని గుర్తించినట్లు పార్కు ఈడీ చెప్పారు. అయితే, ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news