2029 ఎన్నికలలోనే మహిళల రిజర్వేషన్ అమలు: అమిత్ షా

-

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాధ్యాయం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ అజెండాగా ఉందని.. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ అస్త్రంగా వాడుకుంటాయని ధ్వజమెత్తారు. కానీ బీజేపీకి, నరేంద్ర మోడీకి మాత్రం ఈ బిల్లు రాజకీయ అంశం కాదు అన్నారు. ప్రధాని నరేంద్ర చొరవతోనే మహిళా బిల్లు సాధ్యం అవుతున్నదన్నారు.

Want To Win, But Not By Violence Against Rivals: Amit Shah In Parliament

నారీ శక్తి వందన్ అధినియం’పై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మాట్లాడిన అనంతరం బీజేపీ ఎంపీ నిశికాంట్ దూబే ప్రసంగించేందుకు నిలబడ్డారు. ఆ వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు ప్రభుత్వం ఒక మహిళా ఎంపీని నామినేట్ చేయాలని అధీర్ రంజన్, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకున్నారు. డూబే ప్రసంగాన్ని అడ్డుకోవడంపై నిలదీస్తూ, మొదటిగా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అధీర్ రంజన్ అసూయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు.

” 2029 ఎన్నికలలోనే మహిళల రిజర్వేషన్ అమలు. అధీర్ రంజన్‌ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మహిళల పట్ల మహిళలే జాగ్రత్తలు తీసుకోవాలా? వారి గురించి పురుషులు మాట్లాడకూడదా? మీరు ఏ తరహా సమాజాన్ని కోరుకుంటున్నారు? మహిళా సంక్షేమం, మహిళా అంశాల విషయంపై సోదరులు ఒక అడుగు ముందుంటారు. అది మన దేశ సంప్రదాయం. మహిళా సంక్షేమం గురించి ఆలోచించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మా (బీజేపీ) తరఫున నిషికాంత్ మాట్లాడాలనుకుంటే మీకున్న (అధీర్) అభ్యంతరం ఏమిటి? మీకు మొదటగా మాట్లాడేందుకు అవకాశం రాలేదు. అందువల్ల కొద్దిపాటి అసూయగా ఉన్నట్టు కనిపిస్తోంది” అని అమిత్‌షా నవ్వుతూ ఛలోక్తులు విసిరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news