స్పీకర్‌ ముందు ఉండవల్లి శ్రీదేవి రచ్చ…అసెంబ్లీ వాయిదా !

-

ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. స్పీకర్‌ ముందు వైసీపీ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రచ్చ చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. కాసేపటి క్రితమే మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

Undavalli Sridevi Racha in front of the Speaker
Undavalli Sridevi Racha in front of the Speaker

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిన కాసేపటికే.. అసెంబ్లీ రచ్చ మొదలైంది. ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తరుణంలోనే పోటాపోటీగా స్పీకర్‌ పోడియం వద్దకు టీడీపీ, వైసీపీ సభ్యులు వెళ్లారు. టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేశారు వైసీపీ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టారు. దీంతో అసెంబ్లీ వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఇక మళ్లీ అసెంబ్లీ సమావేశాలు గంట తర్వాతే ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news