AP : 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చిప్ విప్ ప్రసాద్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశాన్ని బహిష్కరించింది టీడీపీ పార్టీ.
ఇక ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో 27 వరకు శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. శని, ఆదివారం శాసన సభకు సెలవు ఉండనుంది. రేపు శాసన సభలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చ జరుగనుంది.
కాగా, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల, అనగాని మరియు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ సమావేశాల నుంచి ఒక రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వేటు వేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన చేస్తూ వీడియోస్ తీస్తున్నారని పయ్యావుల, కోటంరెడ్డి, అనగానివి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్.