డబుల్‌ బెడ్‌ ఇండ్ల పంపణీ..దుండిగల్‌ కు చెందిన నేతలు అరెస్ట్‌

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 10 వేల కోట్లు వెచ్చించి అన్నిసౌకర్యాలతో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా తొలి విడతలో ఎన్​ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా.. ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించారు.

ఇక ఇవాళ దుండిగల్‌లో 2,100 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటీఆర్ అందించనున్నారు. కొల్లూరు- 2 లో 4,800 ఇళ్లను మంత్రి హరీశ్‌రావు, తట్టి అన్నారంలో 1,268 ఇళ్లను మంత్రి మహమూద్ అలీ, చర్లపల్లిలో 1,000 ఇళ్లను మంత్రి తలసాని, జవహర్‌నగర్- 3 లో 1,200 ఇళ్లను మంత్రి మల్లారెడ్డి అందించనున్నారు. అయితే.. ఈ రోజు దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామానికి చెందిన భూములలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.

వాస్తవానికి దుండిగల్‌ పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూముల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. అలాగే… ఈ ఇండ్లను స్థానికులకు ఇవ్వకుండా.. వలస వచ్చిన వారికే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత చూపిస్తోంది. దీంతో కేటీఆర్‌ పర్యటనను అడ్డుకోవాలని… దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే.. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చోటు చేసుకున్నాయి.

మేడ్చల్ మల్కాజ్గిరి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రోళ్ల సదానందం, దుండిగల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆరకాల విజయ్ గౌడ్, దుండిగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగ శ్రీశైలం ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల గోపాల్ యాదవ్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అక్బర్ , బజరంగ్ దళ్ తలారి అనిల్, దుండిగల్ మున్సిపల్ కన్వీనర్ బాబు, భారత రాష్ట్ర సమితి కార్యకర్త పండుగ శివకుమార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news