నేటి నుంచి భారత్‌-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు

-

నేటి నుంచి భారత్‌- అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జరగనున్నాయి. రెండు వారాల పాటు ఇరు దేశాల మధ్య ఈ విన్యాసాలు చేపట్టనున్నారు. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్‌ వయిన్‌ రైట్‌ సైనిక స్థావరంలో యుద్ధ్‌ అభ్యాస్‌-23 పేరిట వీటిని నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన 350 మంది సైనిక బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది.

భారత్‌, అమెరికా ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఇటీవల భారత్‌-అమెరికా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న 19వ సైనిక విన్యాసాలు కీలకంగా మారాయి. పర్వత ప్రాంతాలు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సమీకృత యుద్ధ దళాలను మోహరించడం ప్రధాన ఉద్దేశంగా ఈసారి విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమెరికా చేరుకున్న 350 మంది భారత సైనిక బృందం ఈ విన్యాసాలకు సంసిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news