చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసమే పని చేసే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసు అన్నారు. ఏం తప్పు చేశారని 17 రోజులుగా చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనలో భాగంగా టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నీవల్ల అర్పించారు అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదని ఓ కంపెనీ నేను నడుపుతున్న అందులో రెండు శాతం అమ్ముకున్న నాకు రూపాయలు 400 కోట్లు వస్తాయని తెలిపారు.
రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని జైల్లో నిర్బంధించారు చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ప్రజల కోసం ఆయన జైలుకెళ్లారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ వల్ల చాలామంది ఉపాధి పొందారు కొందరు సొంతంగా కంపెనీలు పెట్టుకొని సీఈఓ స్థాయికేది గారు స్కిల్ డెవలప్మెంట్ సంస్థను తీసుకురావడం తప్ప దీనిపై ప్రజలు ఆలోచించాలి మా కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాదు నుంచి బయలుదేరిన ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడానికి ఖండిస్తున్నట్టు తెలిపారు నారా భువనేశ్వరి. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి వీసా పాస్పోర్ట్ కావాలా ఇది ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే హక్కు ప్రజలకు ఉంటుందని శాంతియుతంగానే ర్యాలీ చేపడితే ప్రభుత్వం పోలీసులు భయపడ్డారని పేర్కొన్నారు భువనేశ్వరి.