అలర్ట్.. ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!

-

2000 రూపాయల మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. ఇంకా ఐదు రోజులే మిగిలుండంతో ఇంకా మీ వద్ద ₹2 వేల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఆర్‌బీఐ క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి అనుమతిచ్చింది.

అయితేకి సెప్టెంబర్‌ 25 నుంచి 30 వరకు అంటే ఆరు రోజులు గడువు ఉన్నా.. మధ్యలో ఒక రోజు బ్యాంకులకు సెలవు వస్తోంది. అంటే 25, 26, 27వ తేదీల్లో నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. 28వ తేదీన మిలాద్‌-ఉన్‌-నబి కారణంగా బ్యాంకులకు సెలవు. మళ్లీ 29వ, 30వ తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయి. సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి 7 శాతం నోట్లు వెనక్కి రావాలని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌ 30 తర్వాత రూ.2వేల నోటు గురించి ఆర్‌బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news