SHOCKING NEWS: బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బల్ అవుట్ ఆఫ్ వరల్డ్ కప్ స్క్వాడ్

-

బంగ్లాదేశ్ క్రికెట్ లో చాలా కాలంగా కీలక ప్లేయర్ గా కొనసాగుతూ వచ్చిన లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బల్ కొన్ని రోజుల క్రితం క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత బంగ్లా ప్రధాని స్వయంగా కలుగచేసుకుని తమీమ్ ను పిలిపించి మాట్లాడి మరీ ఆయనను మళ్ళీ క్రికెట్ లోకి రావడానికి ఒప్పించింది. కేవలం వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బల్ స్క్వాడ్ లో ఉండాలని అభిమానులు, సీనియర్ క్రికెటర్లు మరియు ప్రధాని కోరుకున్నారు. కానీ ఇక్బల్ కు సరైన ఫిట్ నెస్ లేని కారణంగా ఈ రోజుతో న్యూజిలాండ్ తో ముగిసిన వన్ డే సిరీస్ లో కేవలం ఒక మ్యాచ్ ఆడిన తర్వాత బ్యాక్ సమస్య తలెత్తడంతో ఈ రోజు మ్యాచ్ కు దూరమయ్యాడు. దీనితో ఇక కుదరదని భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ యాజమాన్యం తమీమ్ ఇక్బల్ ను స్క్వాడ్ నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో అభిమానులు అంతా షాక్ లో ఉన్నారు. మరి తమీమ్ ఇక్బల్ లేకుండా వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఏ మేరకు రాణిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news