ఆస్ట్రేలియాతో మూడవ వన్ డే… బరిలోకి రోహిత్ , కోహ్లీ

-

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో ఉంది, ఇప్పటి వరకు ముగిసిన రెండు వన్ డే లలోనూ ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యి సిరీస్ ను కోల్పోయింది. మొదటి రెండు వన్ డే లకు కెప్టెన్ గా వ్యవహరించిన కె ఎల్ రాహుల్ అద్బుతముగా జట్టును ముందుండి నడిపించి వరుస విజయాలను అందించి సక్సెస్ అయ్యాడు. ఇక రేపు రాజ్ కోట్ వేదికగా మూడవది మరియు ఆఖరి వన్ డే జరగనుంది, ఇక మొదటి రెండు వన్ డే లకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లు ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో కనీసం ఈ మ్యాచ్ ను అయినా గెలుచుకుని పరువును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.. బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతోంది. వార్నర్ , లాబుచెన్ లు మాత్రమే కంటిన్యుయస్ గా రాణిస్తున్నారు..

మరి రేపటి మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా ల మధ్యన జరగనున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news