బీజేపీ నేతల రహస్య సమావేశాలు.. విజయశాంతి క్లారిటీ !

-

బీజేపీ పార్టీ మార్పుపై మరోసారి విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సమాజంల అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలని కోరుకుంటున్నారు…. అన్నట్లు అభిప్రాయం వినబడుతున్నదని పేర్కొన్నారు. ఈ నిజమైన ప్రజా భావాలను దశాబ్ధాల తెలంగాణా ఉద్యమకారిణిగా నేను ఎన్నడూ నా ప్రజల మేలు కోరుతూ, సమర్ధించి తీరుతానని వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలందరం సమావేశమవుతున్నామని…పై ప్రజా కంటక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తొలగించగలదనే విశ్వాసంతోనే బీజేపీ లో చేరినం అనేది వాస్తవం అంటూ చెప్పారు. అందుకు మేము సాధ్యమైనంత వరకు అన్నివిధాలుగా ప్రయత్నించడం సహజం. పార్టీ కి కూడా అదే తెలియచేసామన్నారు. నిజా నిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడు ఉంటది అన్న నా విశ్వాసం ఎన్నటికీ సత్యం అంటూ విజయశాంతి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news