NTR హ్యాట్రిక్ కొట్టలేకపోయారు..కానీ, CM KCR హ్యాట్రిక్ కొడతారు-మంత్రి కేటీఆర్

-

ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని వైరా నియోజకవర్గం గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. రూ.250 కోట్లతో గోద్రేజ్ సంస్థ సహకారంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

KTR Comments On CM KCR

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్‌ ఆదర్శం అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు.. కానీ, బహుశా NTR లాగే ఉంటారనుకునేవాళ్లమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. నాకు వారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు అన్నారు. ఎందరు వచ్చినా ఎన్టీఆర్ కు సాటిలేరు.. తారకరామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందని ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం హ్యాట్రిక్ కొడతారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news