ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై తాజాగా మరోసారి గట్టిగా బదులిచ్చారు. ఆ ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే ముందుగా అవి చూపించాలని జైశంకర్ డిమాండ్ చేశారు.
ఇక ప్రధానమైన సమస్య ఉగ్రవాద ఉదాసీనత. ఉగ్రవాదంపై ఉదాసీనంగా వ్యవహరిస్తే ఎంతటి ముప్పు పొంచి ఉంటుందో ఇప్పటికే పలు దేశాలను చూస్తే అర్థమైపోతుంది. అలా వైఖరే ఇప్పుడు కెనడాలో సమస్యగా మారింది. దాన్ని పరిష్కరించుకోవాల్సి అవసరం ఉంది. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద ఆధారాలు ఉంటే దాన్ని పరిశీలించేందుకు భారత్ రెడీగా ఉంది. మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. కానీ, కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా..!’’ అని జైశంకర్ అన్నారు.