జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు వైసీపీకి రాజీనామా చేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేశారు సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ… 20 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేసి… తర్వాత వైసీపీలో చేరామన్నారు. సర్పంచుల సమస్యలపై ఎన్నోసార్లు మంత్రి, అధికారులను కలిశానని.. 15 శాతం నిధులు మాకు తెలియకుండా దారి మళ్లించారని వివరించారు.
నిధులు, విధులు లేవని నిజాంపట్నంలో సీఎంను కలిసి చెప్పామని… సీఎం అపాయింట్మెంట్ కోసం ఎందరినో కలిశాం, అయినా లాభం లేకపోయిందన్నారు. సర్పంచి వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు, ఇదేం న్యాయం? అని ఆగ్రహించారు. ఎందరో సర్పంచులు ఆత్మన్యూనతతో ఆత్మహత్యలు చేసుకున్నారని… ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థను డమ్మీగా మార్చిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నానని..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా చాలా మంది సర్పంచులు వైసీపీకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. త్వరలో జనసేన పార్టీలో చేరుదామని నిర్ణయించుకున్నానన్నారు.