రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. కమీషన్ రెట్టింపు..!

-

 తెలంగాణ రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీలర్లకు క్వింటాకు రూ.70 కమీషన్ ఇవ్వగా.. దీనిని రూ.140 పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 17వేల మంది డీలర్లకు లబ్ది చేకూరనుంది. డీలర్ల కమీషన్ జీవో కాపీని మంత్రి గంగుల కమలాకర్ సంఘం నాయకులకు అందజేశారు. కమీషన్ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.245 అదనపు భారం పడనుంది.

అదేవిధంగా డీలర్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం కోసం కార్డులను కూడా అందిస్తామని తెలిాపారు మంత్రి. కరోనా మరణించిన డీలర్ల స్థానంలో వారసులకు డీలర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో లక్షలాదిగా రేషన్ కార్డులుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలి ముద్రలు తీసుకుంటున్నట్టు వివరించారు డీలర్లు. 

Read more RELATED
Recommended to you

Latest news