BREAKING : తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలివే

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల జాబితాపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మరో జాబితాపై దృష్టి పెడుతోంది. మరోవైపు అక్టోబర్ రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జనసేన తెలంగాణలో తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో జనసేన పోటీ చేసే 32 స్థానాలు ఏంటంటే..

కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ జనసేనను స్థాపించారని.. ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేసినట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి చెప్పారు. దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని అన్నారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్‌ ఉందని.. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికే ఇందుకు ఉదాహరణ అన్నారు. సింగిల్‌గా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news