నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

-

తెలంగాణలో ఈసారి ఎలాగైనా కేసీఆర్​ను గద్దె దించి.. కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా పటిష్ట ప్రణాళికలు రచిస్తూ గెలుపు తీరాలకు చేేరేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగడుతోంది. ఈ విధంగా తమకే ఓటు వేయాలని ఓటర్లను ఆకర్షిస్తోంది. ఇక ప్రధాని మోదీ పర్యటన.. తమ వ్యూహాన్ని మరింత పటిష్ఠం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ హాజరుకానున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న… ఈ పదాధికారుల సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పలు తీర్మానాలను నేతలు రూపొందించనున్నారు. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు.

ఈ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఘట్ కేసర్ వీబీఐటీ కళాశాలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి వెయ్యి మంది హాజరుకానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇంఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకుకౌన్సిల్ సమావేశానికి ఆహ్వానం పంపారు. రెండు రోజుల సమావేశాల్లో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్దం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news