తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో నందికంటి శ్రీధర్ బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కష్టపడి పని చేశామని…కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థం అయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు వచ్చామన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు బిఆర్ఎస్ లోకి వచ్చామని వివరించారు నందికంటి శ్రీధర్.
మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని.. నిద్రాహారాలు మాని అయినా సరే మైనంపల్లి హనుమంతరావుని ఓడించి, మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానన్నారు. మేడ్చల్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో మల్కాజిగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని వెల్లడించారు నందికంటి శ్రీధర్. అభ్యర్థి ఎవరైనా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే దిశగా పనిచేస్తామని.. మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు నందికంటి శ్రీధర్.