2000 వేల నోట్లు మార్చుకోవడానికి నేడే చివరి రోజు.. ఎక్సేంజ్‌ చేశారా..?

-

పెద్దనోటుకు కాలం చెల్లింది. ఈరోజే 2000 నోటు మార్చుకోవడానికి చివరి తేది. మే 19న 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుంచి ఉన్న రెండు వేలు నోట్లు మార్చుకోవడానికి తొలుత సెప్టెంబర్‌ 30 వరకూ గడువు ఇచ్చారు. అయితే ఇంకా పెద్దమొత్తంలో రెండు వేల నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయని తెలియడంతో.. ఆ గడువును అక్టోబర్‌ 7 వరకూ పొడిగించారు. ఆర్బీఐ నిర్ణయించిన 19 కార్యాలయాల్లో ఇప్పటి వరకూ ఈ నోట్లు మార్చుకునేందుకు అనుమతించారు. ఇక అది కుదరదు.

RBI ప్రకారం.. 2,000 నోట్లను ఇప్పటి వరకు బ్యాంకుల్లో చట్టబద్ధంగా మార్చుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లి ప్రజలు వారి వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను (2000) మార్చుకోవచ్చు. లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. దగ్గరిలోని ఏ బ్యాంక్‌కు (Bank) వెళ్లైనా సరే రూ. 2 వేల నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ చెప్పింది. ఈ రోజుతో 2 వేల నోట్ల మార్పిడికి గడువు ముగియనుంది.

2016లో నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లు ప్రింట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ చాలా కాలంగా రూ.2,000 నోట్లపై అయోమయం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలల్లో రూ.2,000 నోట్లు కనిపించట్లేదు. ఇప్పుడు వీటిని సర్క్యులేషన్ నుంచి తొలగించారు. భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఈ నోట్లను రద్దు చేసిన వెంటనే కొత్తగా రూ.500 నోటుతో పాటు రూ.2,000 నోట్లను ప్రింట్ చేసింది ఆర్‌బీఐ. ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2000 నోట్ల లక్ష్యం నెరవేరింది. దీంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేయబడిందని ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల దగ్గర వద్ద ఒకేసారి రూ.2000 నోట్లను రూ.20,000 పరిమితి వరకు మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఇక ఈరోజు నుంచి అది కూడా ఉండదు. ఈరోజు తర్వాత మీ దగ్గర ఉన్న రెండు వేల నోటు ఎందుకు పనికిరాదు. కాబట్టి వెంటనే వాటిని మార్చేసుకోండి.

ఈ నిర్ణయం మంచిదేనా..?

రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం మంచిదేనని, దీని వల్ల బెనిఫిట్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 2 వేల నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ బయటకు రావడమే కాకుండా, ఫేక్ కరెన్సీ చేసే వారికి బ్రేకులు వేసినట్లు అవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news