విద్యార్థులకు అలర్ట్‌.. దసరా సెలవులో మార్పు

-

తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగను పురస్కరించుకుని.. అక్టోబర్ 23, 24 తేదీలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని జీవో జారీ చేసింది సీఎం కేసీఆర్ సర్కార్. 25వ తేదీ ఆప్షన్ హాలిడే ఇచ్చింది.వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్‌ సభ అక్టోబర్ 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది.

Telangana: Parents' body wary of reopening of schools

ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ముందు ప్రకటించిన సెలవును కూడా కొనసాగించింది.మరోవైపు.. పాఠశాల విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం చెప్పింది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న సెలవు ఇచ్చింది.పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్‌ కళాశాలలకు కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా.. 26న తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news