తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఎరుకల సాధికారిత పథకం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రూ.60 కోట్ల నిధులతో ‘ఎరుకల సాధికారిత పథకం’ అమలు చేయనుంది. ఇందులో భాగంగా పందుల పెంపకం సొసైటీలు, సాట్లర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజీలు, రవాణా, ఫోర్క్ రిటైర్ మార్కెట్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. యూనిట్కు గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు 50 శాతం రాయితీ కల్పిస్తుంది. 40 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుల భాగస్వామ్యం ఉంటుంది.

CM KCR: రైతులకు సీఎం శుభవార్త.. నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల -  NTV Telugu

అయితే.. ఇటీవల ఈ పథకంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎరుకుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం తీసుకోవాలి రావాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పట్టుపట్టి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ .60 కోట్లతో ఎరుకల సాధికారత పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఎరుకల కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎరుకల కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎమ్మెల్సీగా చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించి ప్రతిపాదనలు పంపినప్పటికీ గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని బీజేపీ నాయకులు సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news