అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన…. తమ పార్టీకి ఆరు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీజేఎస్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది ఇలా ఉండగా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ఈ రాష్ట్రా ల్లో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.