తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంటి భాషలలో వచ్చిన సినిమాలు అంటిలో నటించిన అనుభవం ఉంది ప్రముఖ నటుడు నాజర్ కు, ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎన్నో సినిమాలను తన భుజాలపై మోసి సక్సెస్ అయ్యేలా చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంత వయసు అవుతున్నా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాజర్. ఇలాంటి నటుడికి ఈ రోజు పితృ వియోగం జరగడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా తమిళ సినిమా ప్రేక్షకులకు దుఃఖాన్ని నింపింది అని చెప్పాలి. నాజర్ తండ్రి మహబూబ్ భాషా (95) గత కొంతకాలంగా వృద్ధాప్య వయసులో వచ్చే అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు.
కానీ ఈ జీవితానికి ఇక చాలు అనుకున్నారో ఏమో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. చెంగల్పట్టులోని తన నివాసంలో మరణించారు. ఈ మరణంపై ప్రముఖులు సంతాపాన్ని తెలియచేస్తున్నారు.