ఏపీ సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని.. జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనం అని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరిపోయినట్టుందని మండిపడ్డారు. జగన్ జైలులో ఉన్నప్పుడు అతని పెళ్లి, చెల్లి తప్ప ఎవ్వరూ మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
టీడీపీ లేకుండా చేయమంటే.. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక కాదు జగన్ పై ఆనంద్ బాబు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి.. కేసుల భయంతో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడమేనా జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. సొంత బాబాయ్ కూతురు రాష్ట్రంలో తనకు న్యాయం జరుగదంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టడమేనా జగన్ సాధించిన విశ్వనీయత అన్నారు. తండ్రి చావుకి రిలయన్స్ సంస్థ కారణమని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక అదే సంస్థ వైస్ చైర్మన్ కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమేనా జగన్ విశ్వసనీయత అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.