అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహరాల కారణంగా దేశంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న కారణం చూపి…. మర్డర్లు చేస్తున్నారు. అయితే.. తాజాగా ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసింది ఓ అక్క. ఈ దారుణమైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ సంఘటన వివరాల్లోకి వెళితే… తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో చూశారని, సొంత చెల్లెళ్లనే హత్య చేసిందో యువతి. ఆ యువతి వయస్సు కేవలం 20 సంవత్సరాలు అని సమాచారం. అంజలి అనే యువతి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియుడిని పిలిచింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె చెల్లెళ్లు చూశారు. దీంతో వారిద్దరినీ హత్య చేసింది. తొలుత ఎవరో చంపారని అందరికీ చెప్పినా, పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించింది. మృతుల్లో ఒకరికి ఆరేళ్లు కాగా మరొకరికి నాలుగేళ్లు కావడం గమనార్హం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.