రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” , “శపధం” రిలీజ్ డేట్స్ ఫిక్స్ !

-

నిర్మాత మరియు డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫలితంతో సంబంధం లేకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆర్జీవీది. కాగా తాజాగా తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు వ్యూహం మరియు శపధం. దివంగత రాజకీయనాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించడానికి కంకణం కట్టుకున్నారు ఆర్జీవీ. ముఖ్యంగా టీడీపీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ఈ సినెమాలను తీస్తున్నారని ఇప్పటికే పబ్లిక్ లో ఒక టాక్ వైరల్ అవుతోంది. కాగా ముందుగా వ్యూహం సినిమాను నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ, శపధం సినిమాను మాత్రం మరో రెండు నెలలు గ్యాప్ ఇచ్చి జనవరి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

మరి ఈ సినిమాలలో ఏ విషయాలను చూపించనున్నారు… ఇది ఎవరికీ అనుకూలం మరియు ప్రతికూలం కానుంది అన్నది తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news