ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీకి కొత్త తల నొప్పి.. రెండు వర్గాలుగా చీలిన BJYM

-

ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీకి కొత్త తల నొప్పి పట్టుకుంది. ఆ పార్టీ యువ మోర్చా రెండు వర్గాలుగా చీలింది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ వర్సెస్ జాతీయ కోశాధికారి సాయి రెండు వర్గాలుగా విడిపోయారు. అంతా సర్దుకుంటోందన్న సమయంలో ఈ వివాదం ప్రస్తుతం పార్టీలో కలవరం కలిగిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం మీడియా కార్యాశాల, ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య…… ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన విడిదిలో బస చేయకుండా సాయితో వెళ్లాడని తప్పు పడుతున్నారు. ఒకే వర్గానికి కొమ్ము కాసే విధంగా తేజస్వి సూర్య వ్యహరిస్తున్నారని భాను ప్రకాష్ వర్గం ఆరోపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ కార్యాలయనికి తేజస్వి సూర్య చేరుకోగా….. వర్క్ షాప్‌కి తాను హాజరుకానంటు భాను ప్రకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. భాను ప్రకాశ్ ను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు రంగంలోకి దిగారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను, జాతీయ కోశాధికారి సాయి మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news