దారుణం.. కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

-

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది గుండ్ల సింగారంలో ఓ కానిస్టేబుల్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకి శబ్ధం విన్న స్థానికులు కానిస్టేబుల్​పై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్​ను ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

 

ఆర్థిక లావాదేవీలతో తలెత్తిన విభేదాల కారణంగా ఓ కానిస్టేబుల్‌ తన అత్తను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలు పుట్టింటి వద్దే ఉంటుండగా… ఉదయం ప్రసాద్‌ గుండ్లసింగారం వచ్చాడు.

అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఎవరూ లేనిది చూసి.. సర్వీస్ రివాల్వర్‌తో ఆమె ఛాతిపైపై కాల్పులు జరిపారు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. తుపాకీ శబ్దం విని అక్కడికి పరుగులు తీసిన స్థానికులు.. ప్రసాద్‌పై రాళ్లతో దాడి చేసి, తరిమికొట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కమలమ్మ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news