ఎటు చూసినా నోట్లకట్టలే.. 4 రోజుల్లో ‘రూ.37.07 కోట్లు’ స్వాధీనం

-

రాష్ట్రంలో పోలీసులు ఎన్నికల కోడ్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించకుండా యంత్రాంగం… విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ నెల తొమ్మిది నుంచి 12వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల్లో 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు 20 కోట్ల రూపాయలు పైబడే ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 87 లక్షల విలువైన మద్యం.. 89 లక్షల విలువైన మత్తు పదార్థాలు31 కిలోలకుపైగా బంగారు, 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ మొత్తం 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

మరోవైపు 22 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడాసామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల్లో భాగంగా ఇప్పటి వరకు 1196 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ.. రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను కేటాయించారు. కేంద్ర బలగాలు ఈ నెల 20 వరకు విధుల్లో చేరనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 75 వేలకు పైగా ప్రజల, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, వాటిపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news