రేపటి నుంచి భదాద్రి రామయ్య సన్నిధిలో దేవీశరన్నవరాత్రి వేడుకలు

-

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. రెండో రోజున సంతానలక్ష్మి, మూడో రోజున గజలక్ష్మి, నాలుగో రోజున ధనలక్ష్మి , ఐదో రోజున ధాన్యలక్ష్మి, ఆరో రోజున విజయలక్ష్మి, ఏడవ రోజున ఐశ్వర్యలక్ష్మి, ఎనిమిదో రోజున వీరలక్ష్మి, తొమ్మిదో రోజున మహాలక్ష్మి, 24వ తేదీ (విజయదశమి)న నిజరూపలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

ఇదేరోజున ఆలయ అర్చకులు సంక్షేప రామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్టాభిషేకం, విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు శ్రీమద్రామాయణ పారాయణం పఠించనున్నారు. దశమి రోజున పట్టాభిషేకం, సంక్షేప రామాయణ హవనం చేయించుకునేందుకు భక్తులకు ఆలయ అధికారులు అవకాశం ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ 3:30 నుంచి 4:30 గంటల వరకు జరిగే కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొనవచ్చని ఈవో రమాదేవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news