విషాదం.. గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

-

ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరిలోనూ గుండెపోటు వస్తోంది. జీవనశైలిలో మార్పులు.. తీసుకుంటున్న ఆహారం వల్ల ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అప్పటి దాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

జిల్లాలోని మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదరంగి మైథిలి(12) గుండెపోటుతో మృతి చెందింది. ఎంతో ఉత్సాహంగా దసరా సెలవులకు ఇంటికి వచ్చిన మైథిలి హఠాణ్మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మి కుమార్తె మైథిలి. సాంఘిక సంక్షేమ గురుకులంలో మైథిలి ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవు కావడంతో శుక్రవారం రోజున తన అక్క గ్రేసీతో కలిసి ఇంటికి వచ్చింది. సాయంత్రం వరకు హుషారుగా కనిపించిన బాలిక రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. నొప్పి ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news